బతుకుదెరువు కోసం ముంబై, పూణె నుంచి వలస వెళ్లి వచ్చిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని జన్సహస్ సంస్థ డైరెక్టర్ నవీన్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పలు తండాల్లో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలసకూలీలను ఆయన కలిశారు. తమ వంతు సాయంగా వారికి నిత్యావసరాలను అందజేశారు.
లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వలసకూలీలు తండాల్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారిందని.. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని నవీన్‌కుమార్ కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!