ETV Bharat / state

ఇంటర్​ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య - inter results

వికారాబాద్​ జిల్లా భజ్యా నాయక్​ గిరిజన తండాకు చెందిన విస్లావత్​ నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్​ ఫెయిలైనందుకు మనస్తాపంతో అర్థరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

inter-student-suicide-in-vikarabad district
ఇంటర్​ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Jun 19, 2020, 4:28 PM IST

గురువారం విడుదలైన ఇంటర్ పలితాల్లో ఫెయిల్ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం భజ్యా నాయక్ గిరిజన తండాకు చెందిన విస్లావత్ హన్మనాయక్​, లక్ష్మీల కూతురు విస్లావత్ నిఖిత (17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో ఫెయిల్​ అయ్యానని తెలుసుకున్న నిఖిత మనస్తాపానికి గురైంది. అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయాన్నే లేచిన తండ్రి హన్మనాయక్... తన కూతురు నిఖితను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనందుకే మృతి చెందినట్లు తండ్రి హన్మనాయక్ తెలిపారు.

ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.