వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధి తుంకుల్గడ్డ శివారులో ఈనెల 27న ఓ మహిళ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. తుంకుల్గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి తన భార్య పిల్లలను వదిలి ఆ మహిళతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన మహిళ భర్త ఆ పనులు ఆపమని చెప్పాడు.
ఇదే విషయమై ఈనెల 19న మహిళ తన ప్రియుడు రమేష్తో చెప్పి ఈ సంబంధం ఆపేద్దామని చెప్పింది. విచక్షణ కోల్పోయిన రమేష్ ఇనుప రాడ్డుతో ఆమె తలపై కొట్టి హత్య చేశాడు. ఈనెల 27న తల్లి ఇంట్లో శవమై కుళ్లిన స్థితిలో ఉండడం గమనించిన ఆమె కుమార్తె.. తండ్రికి తెలిపింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. భయంతో రమేష్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి : స్కూల్లో వినూత్న వేడుక... చిన్నపిల్లలైన తాతయ్యలు, నానమ్మలు