వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నష్టం చేశారని, లక్ష్మీ దేవిపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా వదిలేశారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాగునీరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తమ హామీని నిలుపుకోవాలని సూచించారు. చాలామంది ప్రజలకు రైతుబంధు డబ్బులు కూడా రాలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లలోనే ఉండి దీక్ష చేపట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు