సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగిలో నిరుపేద కుటూబాలకు డీపీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
లాక్డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశామని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: ఉపవాస దీక్షకు దిగిన బండి సంజయ్