ETV Bharat / state

Farmers Problems: అన్నదాత కష్టం.. కాసుల్లేక కాడెద్దులవుతున్న ధైన్యం - తెలంగాణ రైతుల కష్టాలు

ఎద్దులు కొనేందుకు స్థోమత లేదు. కూలీలను పెట్టుకుందామంటే.. వాళ్లకు డబ్బులు ఎట్లా ఇయ్యాలో తెల్వదు. అప్పోసప్పో చేసి విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా... పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మధ్యలో అతివృష్టో.. అనావృష్టో వస్తే.. ఆగం కావాల్సిందే. అందుకే కొందరు రైతన్నలు సొంత కష్టం మీదనే ఆధారపడుతున్నారు. కుటుంబమంతా కాడెద్దులై.. సేద్యం చేస్తున్నారు.

farmers problems at marpally mandal in telangana

author img

By

Published : Jul 25, 2021, 10:28 PM IST

అన్నదాత కష్టం.. కాసుల్లేక తామే కాడెద్ధులవుతున్న వైనం

టెక్నాలజీ ఎంత పెరిగినా.. జీవనం ఎంత సులభతమైనా.. దుక్కి దున్నే రైతన్న కష్టంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఐదు వేళ్లతో మనం నాలుగు మెతుకులు తినేందుకు తాను మూడు పూటలా చెమటోడుస్తున్నాడు. వచ్చిన యాంత్రిక పద్ధతులను అందిపుచ్చుకునే స్థోమత లేక పాతవాటితోనే సేద్యం చేస్తున్నాడు. కూలీలలకు అయ్యే ఖర్చును భరించలేక కండ కరిగేలా కష్టపడుతున్నాడు. ఎద్దులు కొనేందుకు లక్షలు వెచ్చించలేక.. తానే కాడెద్దవుతూ దుక్కి దున్నుతున్నాడు. మట్టినే నమ్ముకున్న రైతు కుటుంబంలోని చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు సొంత కష్టం మీదనే ఆధారపడుతూ.. వ్యవసాయం చేస్తున్నారు.

తండ్రికి సాయంగా పిల్లల కష్టం...

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో నర్సాపూర్ పెద్దతండాలో సురేష్ అనే రైతు... తనకున్న ఎకరా పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. పంటలో వచ్చిన కలుపును తీసేందుకు తన దగ్గర ఎద్దులు లేకాపోవడం వల్ల తామే దంతే కొడుతున్నారు. పత్తిలో కలుపు తీసేందుకు ఉపయోగించే దంతెను ఒక చివరను ఒకరు బలంగా భూమికి అదిమి పట్టుకుంటే... మరో చివరను ఇంకొకరు లాగుతూ కలుపు తీస్తున్నారు. సురేశ్​తో పాటు తన కుమారులు శ్రీనివాస్, బాల్​సింగ్​ కలిసి తమ పొలంలోని కలుపు తీస్తున్నారు. పొద్దున ఆన్​లైన్​ క్లాసులు విని... తండ్రికి సాయం చేసేందుకు పొలానికి వచ్చామని చిన్నారులు చెబుతున్నారు.

కష్టమో నష్టమో మేమే చేసుకుంటున్నాం...

"నాకు ఉన్న కాస్త పొలంలో పత్తి వేశాను. కలుపు తీసేందుకు నా దగ్గర ఎద్దులు లేవు. అవి కొనాలంటే లక్షలు పెట్టాలి. అంత స్థోమత నాకు లేదు. ఇక కూలీలను పెట్టుకుంటే.. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు వందలు అడుగుతున్నారు. అంత ఇచ్చుకోలేక.. మేమే ఇలా కష్టపడుతున్నాం. కాసేపు నేను.. తర్వాత నా కొడుకులు.. ఇలా కలుపు తీసుకుంటున్నాం. కష్టమో నష్టమో మేమే చేసుకుందామని ఇలా చేసుకుంటున్నాం."- సురేశ్​, రైతు, నర్సాపూర్ పెద్దతండా .

కుటుబమంతా కాడెద్దులయ్యారు...

కొత్లాపూర్​లోని మరో రైతు గోపాల్​రెడ్డికి ఐదెకరాల భూమి ఉంది. అందులో కొంత భాగం మొక్కజొన్న వేశాడు. అందులో కలుపు తీసేందుకు కుటుంబసభ్యులే కాడెద్దులయ్యారు. ఎద్దులను కొనేందుకు లక్షలు వెచ్చించలేక.. కూలీలను పెట్టుకునేంత పెట్టుబడి లేక తామే కాడెద్దులమయ్యామని ఆవేదన వెల్లగక్కుతున్నాడు.

కష్టపడతాం.. తర్వాత దేవుని దయా...

"ఎద్దులను కొనాలంటే లక్షల ముచ్చటనే. అది మాతొని కాదు. ఇప్పటికే పంట మీద కొంత పెట్టుబడి పెట్టినం. ఇప్పుడు కూలీలను కూడా పెట్టుకోవాలంటే ఆ భారం మరింత ఎక్కువైతది. ఎంత పెట్టుబడి పెట్టినా... ఇంకెంత కష్టపడ్డా... పంట చేతికొచ్చే వరకు గ్యారంటీ లేదు. వానొస్తదో.. కరవస్తదో... ఇంటికి పంట వచ్చేదాక నమ్మకమే లేదు. ఉన్నదాంట్లో ఇలా మేమే కష్టపడుతున్నాం. ఇక మిగతాదంతా దేవుని దయా." -గోపాల్​ రెడ్డి, రైతు, కొత్లాపూర్​.

పది మందికి అన్నం పెట్టి.. తానూ ఓ ముద్ద తినేందుకు రైతన్నలు ఇలా.. కష్టపడుతున్నారు. వేసిన పంట చేతికందేసరికి... వర్షార్పణమవుతుందో.. నేలపాలవుతుందో.. తెలియక పెట్టుబడి పెట్టేందుకు జంకుతున్నారు. అంతా పెట్టి ఏమీ రాకపోతే... ఉన్నది కాస్తా అమ్ముకుని ఆగమైపోతామేమోనని... ఆందోళన చెందుతున్నారు. తమ కష్టాన్నే నమ్ముకుని... మిగతాదంతా దేవుని మీద భారమేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.