వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్లిన మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం లింగంపల్లికి చెందిన ప్రసన్న రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేయించుకోవడం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది.
ఆదివారం రోజున ఆపరేషన్‌కి ముందు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారని దానితో కొద్దిసేపటికే ప్రసన్న మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టరు లేని సమయంలో నర్సు ఇంజెక్షన్ ఇచ్చారని అది వికటించే ప్రసన్న మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఇంజెక్షన్ వల్లే మరణించినట్టు తేలితే వైద్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసుల తెలిపారు.