వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోని గూడలో రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు అధికార పార్టీ తెరాస జెండా (Trs Flag) ఎత్తుకెళ్లారని ఆ పార్టీ కార్యకర్తలు పరిగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ జెండా దొంగిలించారని తెలిస్తే ఉన్నత స్థాయి అధికారులు... ఆ పార్టీ నేతలతో చివాట్లు పడతాయనుకున్నారేమో పోలీసులు... వెంటనే డాగ్ స్క్వాడ్(Dog Squad)ను పిలిపించి మల్లెమోని గూడలోని గల్లీగల్లీ గాలించారు.
గల్లీల్లో డాగ్ స్క్వాడ్ కుక్కలు తిరుగుతుంటే అక్కడున్న జనాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. పెద్ద పెద్ద దొంగతనాలు, మర్డర్లు అయితే పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ జెండా పోతేనే ఇంత హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆశ్చర్యం వక్తం చేశారు.
ఇదీ చూడండి: