రాష్ట్రంలో తెరాసకు ప్రత్యమ్నయం భాజపా మాత్రమేనని ఆ పార్టీ జాతీయ మహిళ అధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాననే నినాదంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్. హామీలను మరిచిపోయారని డీకే అరుణ ఆరోపించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న సీఎం ఉద్యోగాలు ఇవ్వకపోగా గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కూడా నెరవేర్చడంలేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!'