వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇంటర్ విద్యార్థినిలకు ఎంఈవో హబీబ్ అలీ, ప్రిన్సిపల్ దేవి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఇంటర్ విద్యను కూడా ఈ పాఠశాలలోనే బోధించడం ఎంతో అభినందనీయమని ఎంఈవో తెలిపారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి ఒక్క మొక్కలను ఒక్కొక్క విద్యార్థి దత్తత తీసుకుని పోషించాలని సూచించారు.
ఇదీ చూడండి: షోపియాన్ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్