వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరై.. సుమారు 400 మంది కుటుంబాలకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత శరత్‌రెడ్డిని అభినందించారు.
ఇలాంటి ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.