వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ డీసీఎం అదుపు తప్పి హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వ్యక్తి ముందు భాగంలో ఇరుక్కుపోయాడు.
ఇటీవలే పరిగిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడం వల్ల పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఘటన జరిగినప్పుడు ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత మంది మీడియా ప్రతినిధులు, పోలీసులు కలిసి డీసీఎంలో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనం కర్ణాటకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డీసీఎం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడం వల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీచూడండి: వైరస్‌కు ఉక్కపోత.. ఉష్ణ మండలంలో వ్యాప్తి తక్కువే!