ETV Bharat / state

క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతిని పరిశీలించిన సీఎస్

author img

By

Published : Jun 6, 2020, 9:29 AM IST

క్షేత్రస్థాయిలో పల్లెప్రగతి కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ బృందం మూడు జిల్లాలను శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం వికారాబాద్​కు హెలికాప్టర్​లో వెళ్లారు.

cs someshkumar visit at vikarabad and inspected harithaharam plants
క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతిని పరిశీలించిన సీఎస్

పల్లె, పట్టణ హరితహారం అమలును పరిశీలించడానికి సీఎస్​ సోమేశ్​కుమార్​, పంచాయతీరాజ్​ శాఖ కార్యదర్శి సందీప్​కుమార్​తో కలిసి వికారాబాద్​ జిల్లాలో పర్యటించారు. వికారాబాద్​ మండలం పెండ్లిమడుగు, నవాబ్​పేట మండలం దాతాపూర్​ గ్రామాల్లోని హరితహారం నర్సరీలు, డంపింగ్​ యార్డులను పరిశీలించారు.

గ్రామాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు చేరుకున్నాకే వెళ్లే గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లు సోమేశ్​ కుమార్​ తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెల్లో మంచి మార్పు వచ్చిందని.. పారిశుద్ధ్య పనులు బాగా జరుగుతున్నాయని సీఎస్​ వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.