ETV Bharat / state

అధికారులు ముఖం చాటేశారు.. అన్నదాతలే వంతెన నిర్మించేశారు! - వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్ పల్లి

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసేకన్నా తమ పనులు తామే చేసుకుంటే భేష్ అనుకున్నారేమో ఆ రైతులు. వికారాబాద్ జిల్లా చిగురాల్ పల్లి గ్రామానికి కూతవేటు దూరంలో మూడు వాగులు. అవి దాటితేనే తమ పంట పొలాల్లోకి చేరుకునే అవకాశం. వాగుల వెనక 400 నుంచి 500 ఎకరాల పంటలు పండించే భూములున్నాయి. వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు. అందుకే వారే రంగంలోకి దిగేశారు.

Cross two channels But there is no proper bridge at chigulralpally vikarabad district
రెండు వాగులు దాటాలి.. కానీ సరియైన వంతెన లేదు
author img

By

Published : Sep 19, 2020, 11:07 AM IST

రెండు వాగులు దాటాలి.. కానీ సరియైన వంతెన లేదు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్ పల్లిలో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షకాలంలో ప్రమాదకర పరిస్థితుల్లో వాగులను దాటుతున్నామని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ కష్టాలను తీర్చాలంటూ ప్రజాప్రతినిధులు, నాయకులకు మొరపెట్టుకుంటున్నామని తెలిపారు. వాగులపై వంతెనలు నిర్మిస్తామని నాయకులు హామీలు ఇస్తున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు.

గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే మూడు వాగులను దాటి వెళ్లాల్సిందే. ఆ వాగుల వెనకాల సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు వారి భూములు ఉంటాయి. అదే దారిలో రుక్కుంపల్లి గ్రామానికి వెళ్లాలి. వాగులపై వంతెనలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

అందరూ కలిసి సొంత డబ్బులు వేసుకుని కర్రలు, తాళ్లతో తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. కానీ ఆ వంతెన పటిష్టంగా లేదని ఇప్పటికే ఇద్దరూ పడిపోయారని గ్రామస్థులు అన్నారు. మనుషులు, మేకలు, గొర్రెలు ఆ తాత్కాలిక వంతెనలపై నుంచి వెళుతుండగా.. బరువు ఎక్కువగా ఉండే గేదలు, ఎద్దులు వాగులోంచి పోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు , నాయకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.