భారత రాజ్యాగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కాలరాస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖాన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య ఫిర్యాదు చేశారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇంటికి సంక్షేమ పథకాలు నిలిపివేయడం... విద్యుత్ కనెక్షన్లు తొలగించడం దారుణమని అన్నారు. కలెక్టర్ అయేషా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మానవ హక్కుల సంఘం దష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తెల్లవారుజామున బహిరంగ మలవిసర్జన చేసే వారిని అడ్డుకుంటున్నారని.. మహిళల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జిల్లా పాలనాధికారిపై చర్యలు తీసుకోవాలని వెంకటయ్య కోరారు.
ఇదీ చూడండి : పాతబస్తీలో భారీ మోసం.. రూ. 9 కోట్లతో ఉడాయింపు