వికారాబాద్ జిల్లా బండ వెల్కిచర్ల గ్రామంలో నిర్వహిస్తోన్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. ఏటా రెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు... ఈనెల 2న ప్రారంభమయ్యాయి. ఈసారి కొవిడ్ కారణంగా పెద్దగా భక్తులను అనుమతించలేదు. కేవలం ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులకు మాత్రమే అనుమతించారు.
ప్రతి సంవత్సరం ఉత్సవాలకు హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. ఈ సంవత్సరం కేవలం కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకతగా నిలిచే అగ్నిగుండం ప్రవేశానికి కేవలం స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించారు. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి: త్వరలోనే హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం: కేటీఆర్