ETV Bharat / state

ఆమెను పదవి నుంచి తొలగించాలి: ప్రతిపక్షనేతలు - తాండూరులో ధర్నా

వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకున్న ఓటుపై వివాదం చెలరేగుతోంది. ఆ రోజు ఆమె వేసిన ఓటు ఆమె తోటికోడలు భర్త​దని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

Concern that the Tandoor Municipality president had voted for someone else in the MLC election
ఆమె ప్రజలను తప్పుదోవ పట్టించారు: ప్రతిపక్షనేతలు
author img

By

Published : Mar 19, 2021, 9:41 PM IST

తాండూరు పట్టణ ప్రథమ పౌరురాలైన తాటికొండ స్వప్న ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్​, తెజస, సీపీఐ నేతలు ఆరోపించారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్సీ ఎన్నికల రోజున తాటికొండ స్వప్న తన తోటికోడలు భర్త అశ్విన్​ ఓటు వేసిందని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి దొంగఓటు వేసిన ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: 'ఆ వివాదాలకు 2 వారాల్లో పరిష్కారం చూపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.