భక్తితో జరుపుకునే పండుగల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి ఆయేషా మస్రత్ ఖానం సూచించారు. కొడంగల్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయకులపై అవగాహన కల్పించారు. చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం కలుషితమైపోవటం వల్ల ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వచ్చే వినాయక చవితిలో రసాయనాలతో చేసినవి కాకుండా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను పసిపాపల్లా సంరక్షించాలన్నారు ఆయేషా.
ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు..