వ్యవసాయ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై రుద్దుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పొలం బాటలో భాగంగా వికారాబాద్ మండలం మదనపల్లిలో రేపు అయన పర్యటించనున్నారని తెలిపారు.
రైతులతో భట్టి విక్రమార్క మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'అధికారంలోకి వచ్చాక చక్కెర ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం'