మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో సుమారు వెయ్యి మంది ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ముస్లింలకు, దళితులకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: బాలికపై ఇంట్లోనే అత్యాచారయత్నం...