ETV Bharat / state

కాంగ్రెస్​ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు - konda

కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్సైపై దుర్భాషలాడారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

case-on-konda
author img

By

Published : Apr 16, 2019, 11:04 PM IST

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. గచ్చిబౌలి ఎస్సై కృష్ణను దుర్భాషలాడారనే ఫిర్యాదుతో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి డబ్బుతో పట్టుబడ్డాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన డబ్బు అని సందీప్​ రెడ్డి చెప్పడంతో కేసు నమోదు చేశారు.

కేసుకు సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఆయన ఇంటికి ఎస్సై కృష్ణ వెళ్లారు. ఆ సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి దుర్భాషలాడటంతో పాటు... అవమానించారని ఎస్సై ఫిర్యాదు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్​ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.