ETV Bharat / state

'భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' - తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా పరిగిలో భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల పట్ల మోదీ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీపీఎం జిల్లా రైతు కన్వీనర్ వెంకటయ్య తెలిపారు.

Bharat Bandh continues at parigi in vikarabad district
'భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది'
author img

By

Published : Mar 26, 2021, 1:55 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రశాంతంగా కొనసాగుతోంది. చట్టాలను రద్దు చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. వాటిని అరికట్టే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. మోదీ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీపీఎం జిల్లా రైతు కన్వీనర్ వెంకటయ్య తెలిపారు.

ఇదీ చదవండి: రైలు పట్టాలపై రైతుల అర్ధనగ్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.