వికారాబాద్ జిల్లా తాండూరులో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో.. మహిళలు, చిన్నారులు కలిసి ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
తాండూరులోని గాంధీనగర్, మల్రెడ్డిపల్లి, సాయిపూర్, శాంతినగర్ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను నెత్తిన ఎత్తుకుని మహిళలు వీధుల్లో తిరుగుతూ .. ఆడిపాడి.. పట్టణ సమీపంలోని కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు.