వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం కొజ్జ వనంపల్లికి చెందిన దావీదుకు వారసత్వంగా 3.29 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. నాలుగు ఏళ్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తన పేరుపైనా పట్టా మార్పిడి కాలేదు. గత సంవత్సరం ప్రొసీడింగ్ ఇచ్చినా ఆన్లైన్లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదు చేయడానికి దావీదు కుమారుడు సాయికుమార్‌ను వీఆర్వో తలారి రాములు 5 వేలు డిమాండ్ చేయగా... అతను 4 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు.
ఈ విషయంపై సాయికుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వీఆర్వో రాములు సాయికుమార్‌ను తన స్వగ్రామం చిట్టిగిద్దలోని తన వ్యవసాయ పొలంకు వచ్చి డబ్బులు ఇవ్వాలని కోరాడు. పొలంలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు విచారించి కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్ విద్యార్థులు