ETV Bharat / state

మహిళ హత్య - మహిళ హత్య

వికారాబాద్​లో మహిళ హత్య కలకలం రేపింది. కూలి పనులు చేసుకొనే స్వరూపను దుండగులు గొంతు కోసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు
author img

By

Published : Mar 4, 2019, 12:41 PM IST

దారుణ హత్యకు గురైన మహిళ
వికారాబాద్​ జిల్లాలో స్వరూప అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. కోటపల్లి మండలం రాంపూర్​కు చెందిన స్వరూపకు వికారాబాద్​ గోదంగూడకు చెందిన సుధాకర్​రెడ్డితో 16 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. 6 ఏళ్ల కిందట భర్తతో విడిపోయి.. కూలి పనులు చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది. హత్య విషయం తెలుసుకున్న స్వరూప తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మధ్య సుధాకర్​రెడ్డి తమ కూతురు ఇంటికి తరచూ వస్తున్నాడని పోలీసులకు తెలిపింది.

హత్య జరిగి రెండురోజులు

మహిళ హత్య జరిగి రెండు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్​టీం ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వికారాబాద్​ సీఐ సీతయ్య తెలిపారు.

ఇవీ చూడండి :అజార్​​ మృతిపై సందిగ్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.