నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించారు. హుజుర్నగర్లో పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని నాయకులు చంద్రబాబుకు సూచించారు. రేపు తెలంగాణ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు వారికి తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం