ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్‌లైన్ ద్వారా సేవలందించాలని రాష్ట్ర రవాణా శాఖ(telangana transport department) నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించడానికి ఎక్కడైనా - ఎప్పుడైనా (anywhere anytime) అనే విధానాన్ని ఇప్పటికే రవాణాశాఖ ప్రవేశపెట్టింది.
దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్ ఫోలియో ద్వారా సేవలు అందిస్తున్నామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు వెల్లడించారు. పౌరులు తమ స్మార్ట్ మొబైల్(smart mobile) నుంచి 17 రకాల సేవలను పొందవచ్చని.. ఈ సేవల కోసం రవాణా, ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
“టీ-యాప్ ఫోలియో యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్(Google Play store) నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని.. తర్వాత కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. అందులో అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలి. డూప్లికేట్ లైసెన్స్, ఇష్యూ ఆఫ్ బ్యాడ్జ్, స్మార్ట్‌కార్డు, లైసెన్స్ హిస్టరీ షీట్, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ పర్మిట్, పర్మిట్ రెన్యువల్, టెంపరరీ పర్మిట్ వంటి 17 రకాల సేవలు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి".
--- రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు