సంతోషాల సంబరం...సరదాల వసంతం..హోలీ హోలీ పండుగంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అందమైన రంగుల్ని అద్దుకుంటూ, ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ హరివిల్లును చూపిస్తారు. మనిషి జీవితంలో అన్ని రకాల అనుభూతులు వెల్లివిరియాలని... అన్ని రకాల రంగులను ఉపయోగిస్తుంటారు. అందరికీ ప్రీతిపాత్రమైన ఈ పండుగని ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకుంటారు.ఒక్కోచోట ఒక్కోలా...
మన దేశంలో ఈ పండుగను హోలీగా పిల్చుకుంటాం. కొన్ని పల్లెల్లో కాముడి పండుగగా, రంగుల పండుగనీ అంటారు. పశ్చిమ బంగాలో బసంత్ ఉత్సబ్, వసంతోత్సవంగా జరుపుకుంటారు. బంగ్లాదేశ్లో దోల్యాత్రా, దోల్ జాత్రాగా పిలుస్తారు. పంజాబ్లో ఈ సరదాకి హోలా మొహల్లా అని పేరు.
ఇవీ చదవండి:మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి: పొన్నం