ETV Bharat / state

ఆహార పదార్థాల ప్యాకేజ్‌లపై గడువు తేదీని ముద్రించాల్సిందే! - labelling of food products is mandatory in telangana

మీరు కొంటున్న ఆహార పదార్థాలు ప్రమాణాల మేరకే ఉంటున్నాయా..? నాణ్యమైన ఆహారమే మనం తీసుకుంటున్నామా..? మనం కొనుగోలు చేసే వాటిలో పోషక విలువలు ఏ మేర ఉన్నాయి..? ఈ ప్రశ్నలకు అస్పష్టమైన సమాధానాలే లభిస్తాయి. ఓ ప్యాకేజింగ్‌పై ఉన్న వివరాలు నిజమా కాదా అన్నది ఎవరికీ తెలియదు. చూస్తున్నాం. కొంటున్నాం...అంతే..! ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలియని గందరగోళంలో..విలువైన ఆహార పదార్థాలు...వినియోగించకుండానే చెత్త బుట్టలోకి చేరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ప్రయత్నిస్తోంది. లేబులింగ్ అండ్ డిస్‌ప్లేకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చి...ఆహార నాణ్యత పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

Food Safety Standards Institute of India did mandatory of labelling for food products
ఆహార పదార్థాల ప్యాకేజ్‌లపై గడువు తేదీని ముద్రించాల్సిందే!
author img

By

Published : Feb 20, 2021, 9:47 AM IST

ఆహార పదార్థాల ప్యాకేజ్‌లపై గడువు తేదీని ముద్రించాల్సిందే!

"ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు విక్రయించే సంస్థలు..."బెస్ట్‌ బిఫోర్‌ డేట్‌" ముద్రించే సంస్కృతికి ఇకపై స్వస్తి పలకాలి..! కచ్చితంగా గడువు తేదీని ముద్రించాల్సిందే..! భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ-ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఇటీవల జారీ చేసిన ఆదేశాలివి. గడువు తేదీ విషయంలో చాలా సంస్థలు ప్రమాణాలు పాటించటం లేదన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చాలా సందర్భాల్లో ఇది సమస్యలూ తెచ్చి పెడుతోంది. సామాజిక కార్యకర్తలు పదేపదే ప్రభుత్వాలతో ఈ అంశంపై ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోవడంలేదు. అయితే కరోనా తర్వాత ఆహార భద్రతపై అంతటా శ్రద్ధ పెరిగింది. ప్రజలంతా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలన్న స్పృహ కొంత మేర పెరిగింది. ఇందులో భాగంగానే..లేబులింగ్ అండ్ డిస్‌ప్లేకి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది... ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ.

లేబులింగ్ అండ్ డిస్​ప్లే

ప్యాకేజ్డ్‌ పదార్థాలపై...ఆ ఆహారానికి సంబంధించిన పోషకాలేమిటో ముద్రించాల్సి ఉంటుంది. అయితే...ఉన్నవి లేనివి కల్పించి వీటిని చూపిస్తుంటాయి...కొన్ని సంస్థలు. అక్షరాలు కనిపించీ కనిపించకుండా...చిన్నవిగా ముద్రిస్తుంటాయి. ఇక మాంసాహారం, శాకాహారం అని తేడా తెలిసేలా కచ్చితంగా ఎరుపు, ఆకుపచ్చ ముద్రలు ఉంచాలి. ఇవి ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలే అయినా...చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నాయి చాలా కంపెనీలు. అయితే...ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన లేబులింగ్ అండ్ డిస్‌ప్లే నిబంధనలు మాత్రం కఠినంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార పరిశ్రమల పరిధిలో తొలిసారిగా...18 ఏళ్ల లోపున్న వారందరినీ పిల్లలుగానే వ్యవహరించి..వారి ఆహార భద్రతకు కట్టుబడి ఉండాలనీ చెబుతోంది... ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ.

కలర్ కోడెడ్ లేబుల్స్

ఈ-కామర్స్ సైట్లు, రెస్టారెంట్లలో విక్రయించే ఆహార పదార్థాలకూ ఇవే నియమాలు వర్తిస్తాయని స్పష్టంగా చెబుతోంది ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ. కలర్‌ కోడెడ్ లేబుల్స్‌ని వర్గీకరించే విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. కొవ్వు, చక్కెర శాతం అధికంగా ఉంటే ఆయా ఆహార పదార్థాలపైన అందుకు సంబంధించిన వివరాలు కచ్చితంగా ముద్రించాలి. వాటిని కలర్‌ కోడింగ్ ఆధారంగా విభజించాలి. అయితే...ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముంది. లేబులింగ్ విధానంలో భాగంగా...నిర్దేశిత ఆహార పదార్థం ఎప్పుడు, ఎక్కడ, తయారు చేశారో.. ఎక్కడ నిల్వ చేశారన్నది స్పష్టంగా ముద్రించాలి. ఆహార పదార్థం పేరు, పోషకాల పరిమాణం వివరాలు ఇవ్వాలి. ఆహార భద్రతా ‌ప్రమాణాల సంస్థ అందించిన లైసెన్స్‌, లోగో, కోడ్‌, పరిమాణం, రీటైల్ ధర, కస్టమర్ కేర్‌ నంబర్‌ లాంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. నిల్వ ఉండేందుకు ఆహార పదార్థాల్లో కలిపే అడిటివ్స్‌కి సంబంధించిన వివరాలూ ఇవ్వాలి. 2022 జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ నిబంధనలు అమలు చేసేలా అన్ని సంస్థలు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

క్యాలరీల వివరాలు అందించాలి

కేంద్రం నుంచి అనుమతి పొంది...10 కన్నా ఎక్కువ చోట్ల ఉన్న రెస్టారెంట్‌లు, కేఫ్‌లు..తమ ఆహార పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు ఉన్నాయని స్పష్టంగా ముద్రించాలి. మెనూ కార్డులోనే ఇందుకు సంబంధించిన వివరాల ఇవ్వాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి..రోజుకు సగటున 2 వేల క్యాలరీలు తీసుకోవచ్చని చెబుతారు. ఈ మోతాదు మించకుండా ఉండేలా ఆయా ఆహార పదార్థాల క్యాలరీల వివరాలు అందించాలన్నది ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నిబంధన. ఇక...నీళ్ల సీసాలు విక్రయించే సంస్థలూ.. ఆ నీటిలో ఔషధ గుణాలున్నాయని ప్రచారం చేసుకోవటం ఆపాలని స్పష్టంగా చెప్పింది.

అదనపు ఆర్థిక భారం

ప్రిన్సిపల్ డిస్‌ప్లే ప్యానెల్‌ ప్రకారం...ఆహార పదార్థ ప్యాకేజ్‌కి ముందు భాగంలోనే ఈ వివరాలు ముద్రించాలి. అంటే వినియోగదారుడు వెతుక్కునే పని లేకుండా కంటికి కచ్చితంగా కనిపించేలా పెద్ద అక్షరాలతో వీటిని ముద్రించాల్సి ఉంటుంది. నిజానికి 2011లోనే భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ...ఇందుకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పుడు వాటిని ప్యాకేజింగ్, లేబులింగ్ అండ్ డిస్‌ప్లేలుగా విభజించి...మరింత సంస్కరించి పటిష్ఠంగా అమలు చేయాలని చూస్తోంది. పరిశ్రమ వర్గాలు, సంస్థలతో సుదీర్ఘ చర్చల తరవాతే ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే...18లోపు ఉన్న వారందరినీ పిల్లలుగానే పరిగణించి.. అందుకు అనుగుణంగా ఆహార పదార్థాల తయారీ ఉండాలన్న నియమంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే...సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలు మార్చుకుని మళ్లీ కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు. ఇదే జరిగితే...ఆ మేరకు ఆయా కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

నచ్చినట్టు ప్రచారం

ఇప్పటికీ చాలా సంస్థలు తయారు చేసే ప్యాకేజ్‌లపై ఎప్పటి వరకు అది నిల్వ ఉంటుందన్న వివరాలు స్పష్టంగా ఇవ్వటం లేదు. అందుకే...ఈ విషయంలో ఎప్పుడూ గందరగోళమే. అందులోనూ ప్రాంతాల వారీగా...లేదా సంస్థల వారీగా...ఈ లేబులింగ్ విధానంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ అస్పష్టత...ఆహార వృథాకు దారి తీస్తోంది. నిబంధనలు కఠినంగా అమలయ్యే చోట మాత్రమే ఆహార వృథా అడ్డుకోవటం సాధ్యమవుతోంది. సాధారణంగా...నాణ్యతను సూచించే లేబుళ్లు, శాకాహారమా, మాంసాహారమా అని చెప్పే లేబుళ్లు ముద్రిస్తుంటాయి సంస్థలు. అయితే ప్రమాణాల మేరకు నడుచుకునేవి మాత్రం కొన్నే. ఒకవేళ వీటిని ముద్రించినా...అవీ స్పష్టంగా అర్థం కావు. వీటిపై సరైన నిఘా లేకపోవటం వల్ల ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తమకు నచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నాయి.

లేబులింగ్ విధానాన్ని వ్యతిరేకించాయి

ఏదైనా ఆహారంలో కొవ్వు, ఉప్పు లేక మరేదైనా పదార్థం మోతాదుకి మించి ఉంటే...ఎరుపు రంగు లేబుల్‌ని ముద్రించాలి. ఐదేళ్ల క్రితమే కేంద్రం ఈ విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఏయే పదార్థం మోతాదుకి మించి ఉందో గుర్తించి అందుకు తగ్గట్టుగా ఎరుపు రంగు డాట్‌ని ఉంచితే వినియోగదారులకు సులువుగా అర్థమవుతుందని పేర్కొంది. కానీ...ఈ లేబులింగ్ విధానాన్ని వ్యతిరేకించిన పరిశ్రమ వర్గాలు...అమలు చేసేందుకు అసలు అంగీకరించలేదు. ఇలా ఎరుపు రంగు లేబుళ్లు ముద్రిస్తే...విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి. ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకపోవటం వల్ల లేబులింగ్‌ విధానం అటకెక్కింది. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.