తనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదిని నియమించింది. హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డిని ఆంధ్రా ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కారు తరఫున ఉన్న స్టాండింగ్ కౌన్సిల్‌కు సహాయకారిగా ఈ కేసు విచారణ కోసం ప్రకాశ్ రెడ్డిని నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్యాట్‌లో వాదనలకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై క్యాట్‌లో వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదిని నియమించింది. సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదిని నియమించింది. హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డిని ఆంధ్రా ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కారు తరఫున ఉన్న స్టాండింగ్ కౌన్సిల్‌కు సహాయకారిగా ఈ కేసు విచారణ కోసం ప్రకాశ్ రెడ్డిని నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి :
క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు