సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సహజ యోగా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా అవసరమని... దాని వల్ల మత్తు, మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. భారతదేశవ్యాప్తంగా సహజ యోగాతో అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా తెలంగాణ ముఖద్వారమైన కోదాడ పట్టణంలో సహజ యోగ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. యోగాతో ఆరోగ్యమే కాదు... ఆనందం లభిస్తుందని చెబుతున్నారు.
ఇది చదవండి: ఎన్కౌంటర్ శంకర్‌తో 'ఇస్మార్ట్ శంకర్'