జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గత రాత్రి మహిళలు ఆందోళనకు దిగారు. దుకాణాన్ని శివారు ప్రాంతానికి తరలించాలంటూ ధర్నా చేశారు.
పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గం ద్వారానే పోతుండడం వల్ల మందు బాబులతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు ఆరోపించారు. తాగిన మైకంలో మాలమూత్రలు ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తూ చుట్టుపక్కల ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం