ETV Bharat / state

భానుపురి కుటుంబ సభ్యుల మధ్య వార్డుల చిచ్చు - vote

వార్డుల విభజన భానుపురి ప్రజలను అస్తవ్యస్తం చేసింది. నివాసం ఓచోట, పేరు మరోచోట, ఒకే ఇంట్లో పేర్లను విడదీసి సొంతకుటుంబ సభ్యుల మధ్యే చిచ్చుపెట్టారు. జంబ్లింగ్ పద్ధతిని పోలిన విభజన సూర్యాపేట పట్టణ ప్రజలకు తలనొప్పిగా మారింది. వృద్ధులకు ఓటర్ జాబితాలో పేర్లు తెలుసుకోవటం కష్టంగా మారింది.. వార్డులను విభజించి గందరగోళం సృష్టించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఓటర్ల జాబితా తప్పుల తడక
author img

By

Published : Aug 7, 2019, 10:55 AM IST

భానుపురి కుటుంబ సభ్యుల మధ్య వార్డుల చిచ్చు

సూర్యాపేట జిల్లా కాకముందు మున్సిపాలిటీలో 34 వార్డులు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం 48 వార్డులయ్యాయి. పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు కుడకుడ, దురాజ్​పల్లి, రాయినిగూడెం, కుసుమవారి గూడెం, దాసాయిగూడెం, గాంధీనగర్ గ్రామాలు పట్టణంలో విలీనమయ్యాయి.

ఓటర్ల జాబితా తప్పుల తడక

లక్ష యాబైవేల జనాభా కలిగిన 'పేట'లో 48 వార్డులకు హద్దులు కేటాయించారు. దీని ప్రకారం ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించకపోవటం వల్ల సమస్యలు మొదలయ్యాయి. ఓటర్లను మూడు నాలుగు భాగాలుగా విభజించి పేర్లను తారుమారు చేశారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను నాలుగు వార్డులకు విభజించారు. పురపాలక అధికారులు ప్రతి వార్డుకు రెండు వేల ఓట్లు ఉండాలన్న లెక్కతో ఇష్టారీతిలో తారుమారు చేశారు.

తల్లిదండ్రులదో కులం...బిడ్డలది మరో కులం

ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి ఒక కులంగా నమోదైతే కూతురు ఓటును మరో కులంగా నమోదు చేశారు. ఒకే ఇంటికి చెందిన ఓట్లను నివాసమున్న వార్డుకు బదులు.. మరో వార్డులో చేర్చారు. అంబేడ్కర్​నగర్​లోని ఓటర్లను 3 భాగాలుగా చేసి భగత్​సింగ్ నగర్, జి.వి వి ఫంక్షన్ హాల్ ప్రాంతంలోని 8వ వార్డుకు మార్చారు.

రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లు మార్చారు

వార్డుల విభజనలో తెరాస రాజకీయ ప్రయోజనాల కోసమే అధికారులు పనిచేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. సమీపంలోని ఇళ్లను, ఆయా ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని వార్డు విభజన చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్​

ప్రజలు ఓట్లు వేసేందుకు సౌకర్యంగా ఉండే విధంగా వార్డులు విభజించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పారదర్శకత పాటించాలి.

ఇదీ చూడండి: కశ్మీర్​పై మోదీ హిట్​... కాంగ్రెస్​ 'హిట్​ వికెట్'

Intro:Slug : TG_NLG_21_05_WARDS_VIBHAJANA_PROBLEMS_PKG_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సూర్యాపేట.

సెల్ : 9394450205

★ దీని స్క్రిప్ట్ FTP లో సెండ్ చేశాను.

Body:..

Conclusion:..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.