సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తన ఓటు హక్కు గల్లంతవడంపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. నలభై సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ ఇప్పటివరకు ప్రతి ఎన్నికలో ఓటు వేసినట్లు గుండు శ్రీదేవి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నానని ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో తన పేరు ఎలా గల్లంతైందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో తన ఓటు కోసం తిరిగానని ఎక్కడా ఓటు లేనందున బాధపడుతూ తిరిగి వెళుతున్నాని ఆమె తెలిపారు. తుంగతుర్తిలో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఓటు వేశారని ఈసారి మాత్రం తనకు, తన ఇద్దరు పిల్లల పేర్లు ఓటర్ లిస్టు లేదని అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తుంగతుర్తి మొదటి జడ్పీటీసీ తాటి విజయమ్మ తన తల్లి అని... రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతుందనుకోలేదని వాపోయారు.
ఇవీ చూడండి: భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ