సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. కరోనా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ చింతకాయల ఉపేందర్ తెలిపారు.
లాక్డౌన్కు పూర్తి మద్దతునిస్తూ గ్రామంలోని దుకాణాలను స్వచ్చందంగా మూసేశారు. ఒంటి గంట తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు రావాలని సర్పంచ్ సూచించారు. లాక్డౌన్ సమయాల్లో బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోనే లాక్డౌన్ విధించిన మొదటి గ్రామంగా మునగాల నిలిచిందని చెప్పారు.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్లో ఒడుదుడుకులున్నా... ప్రస్తుతం ఆశాజనకమే..!