ETV Bharat / state

వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం - వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

సూర్యాపేట జిల్లాలోని శ్రీకోదండరామ ఆలయంలో శ్రీరాముని పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి దేవస్థాన అర్చకులు లక్మీనరసింహచార్యులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు.

వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం
author img

By

Published : Apr 15, 2019, 3:38 PM IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇవాళ శ్రీరాములవారికి వైభవంగా పట్టాభిషేకం చేశారు. యాదాద్రి అర్చకులు నల్లందిగల్​ లక్మీనరసింహాచార్యులు వేణుగోపాలపురం గ్రామస్థుడు కావడం వల్ల ఆయన చేతుల మీదుగా జరిపించారు.

వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

శ్రీకోదండరామ స్వామి ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది. కొల్లు పాపయ్య చౌదరి అనే వ్యక్తి కలలోకి శ్రీసీతారామస్వామి వచ్చి గుడిని నిర్మించాలని కోరాగా.. 1933లో ఈ ఆలయాన్ని నిర్మించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ దేవస్తానానికి నూట ఒక్క ఎకరాల భూమిని దానంగా ఇచ్చారని స్థానికులు అంటున్నారు. పూర్వం ఈ గ్రామం కృష్ణాజిల్లాలో ఉండగా.. తర్వాత నల్గొండలోకి మారింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉంది.

ఇదీ చూడండి: భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.