సూర్యాపేటలో నిర్మించబోయే మెడికల్ కళాశాలకు కల్నల్ సంతోష్‌బాబు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందారన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలిన కుమారుడి పట్ల కల్నల్ తల్లిదండ్రులు గర్వంగా ఉన్నారని తెలిపారు. సంతోష్‌బాబు రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారని కొనియాడారు. భవిష్యత్‌లో కల్నల్ కుటుంబసభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
"సూర్యాపేటలో నిర్మించబోయే మెడికల్ కళాశాలకు కల్నల్ సంతోష్‌బాబు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా. లేకపోతే ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టుకు కల్నల్ పేరు పెట్టి చిరస్థాయిలో ఆయన పేరు నిలిచిపోయేలా చేయాలి. దేశానికి, రాష్ట్రానికి ఆయన ఎంతో పేరు తెచ్చారు."
---- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: కల్నల్ సంతోష్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ!