సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ పరపతి సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. సకాలంలో యూరియా అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకు ఒక్కసారి లోడు రావడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
రోజు 200 మంది అన్నదాతలు యూరియా కోసం వస్తున్నారు. ప్రైవేట్‌గా యూరియా దొరకగా పోవడం వల్ల రైతులందరూ సహకార సంఘానికి వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు
ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు