ETV Bharat / state

Two Farmers Died in Suryapet Video : ట్రాక్టర్​ బోల్తాపడి ఒకరు.. అది చూసి గుండెపోటుతో మరొకరు

author img

By

Published : Jul 31, 2023, 7:10 PM IST

Two Farmers Died in Suryapet District : పంట పొలాన్ని దున్నతున్న క్రమంలో ట్రాక్టర్​ అదుపు తప్పి డ్రైవర్​ మృతి చెందాడు. ఇది చూసిన ఆ పొలం యజమాని గుండెపోటు వచ్చి నేలకూలి మరణించాడు. ఈ హృదయ విదారకర ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

Two Farmers Died in Suryapet Video
Two Farmers Died in Suryapet Video

Two Farmers Died in Suryapet District : రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పంట పండించేందుకు సరిపోయేంతలా పడ్డాయి. దీంతో కర్షకులు సంతోషంతో పంట పండించేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగానే ఓ గ్రామంలోని పొలం యాజమాని తన పంట పండించేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో ట్రాక్టర్​ని పెట్టి పంట పొలాన్ని దున్నేందుకు ఓ డ్రైవర్​ని పెట్టుకున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ఈ సంవత్సరం అయినా పంట బాగా పండించి ఆనందం పడదాం అనుకునే లోపు.. విషాదం ఎదురైంది. తాను ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది. పంట పొలాన్ని దున్నేందుకు వచ్చిన ట్రాక్టర్​ డ్రైవర్​.. పంటను దున్నుతున్న సమయంలో ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ డ్రైవర్​ మృతి చెందాడు. జరిగిన ఘోరాన్ని కళ్ల ముందే ఆ రైతు చూశాడు. మన కళ్ల ముందే ఏదైనా ఘోరం జరిగితే ఒక్క క్షణం ఏమి జరుగుందో తెలియదు. అలాంటిది ఆ అన్నదాత ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా గుండెపోటుతో నేలకూలాడు. అతను కింద పడిన దగ్గరే ట్రాక్టర్​ ఉండడంతో ఆ రైతు కూడా మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

ట్రాక్టర్​ బోల్తా పడి ఇద్దరు రైతులు మృతి చెందారు

ORR Accidents Today : నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని పర్యాయపల్లి గ్రామానికి చెందిన మిడతపల్లి మల్లయ్య తన సొంత పొలాన్ని ట్రాక్టర్​తో దున్నాలనుకున్నాడు. దీనికోసం బోల్లంపల్లి గ్రామానికి చెందిన రామలింగయ్యను ట్రాక్టర్​ డ్రైవర్​గా సాయం కోరాడు. దీంతో రైతు పొలాన్ని రామలింగయ్య దున్నుతున్న క్రమంలో బండి​ అదుపు తప్పింది. ట్రాక్టర్​ కింద పడి డ్రైవర్​ మృతి చెందాడు. కళ్లముందే ఇదంతా చూస్తున్న రైతు మల్లయ్య(80) ఒక్కసారిగా సంఘర్షణకు లోనై గుండెపోటుతో కింద పడ్డాడు. పడేనప్పడు ట్రాక్టర్ వీలు తగిలి రైతు కూడా మృతి చెందాడు.

Rama Lingayya and Mallayya Died in Suryapet : ఈ సమాచారం విన్న కుటుంబీకులు, స్థానికులు కన్నీరుమున్నీరు అయ్యారు. దీంతో గ్రామం అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. జరిగిన ఘటనను పోలీసులు పరిశీలించారు. మృతి చెందిన ఇద్దరి రైతుల పూర్తి వివరాలను స్థానిక పోలీసులు సేకరించారు. కర్షకులు మృతి చెందిన తీరును స్థానికులు వివరించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరి రైతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.