హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశంలోనే మంచి పేరు తెచ్చాయని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సైదిరెడ్డిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తెరాస జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. సైదిరెడ్డికి 50 వేల మెజార్టీ పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం