మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల తెరాస వ్యూహాలపై సూర్యాపేట జిల్లా కోదాడలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 3 వందల మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై కార్యకర్తలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగరబోతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి