సూర్యాపేట జిల్లా వాసునగర్ మండలం కోదాడ రోడ్డులోని చెక్ పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో శిరస్త్రాణం ధరించాలని ద్విచక్ర వాహనదారులకు సూచించారు. అనంతరం ఎంబీ కాలువ దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. తర్వాత హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ట్రాఫిక్ నియమ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఇవీ చూడండి: హాస్యనటుడు వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత