ETV Bharat / state

'బాధలో ఉన్న వారిపై మంత్రుల విమర్శలా...?' - తెరాస మంత్రులపై ఉత్తమ్​ విమర్శలు

ఇప్పటికే ఎంతో బాధతో కుమిలిపోతున్న ఆర్టీసీ కార్మికులపై మంత్రులు విమర్శలు చేయటం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉత్తమ్​ మద్దతు తెలుపుతూ... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

TPCC CHIEF UTTAM KUMAR REDDY COMMENTS ON TRS MINISTERS ABOUT TSRTC EMPLOYEES
author img

By

Published : Oct 16, 2019, 10:23 PM IST

యాభైవేల మంది ఆర్టీసీ కార్మికులు వారి కుంటుంబాలను రోడ్డుపై పడేసిన దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. తెరాసకు బుద్ధి చెప్పాలన్నా... ఆ పార్టీని ఓడించాలన్నా కార్మికుల వల్లే అవుతుందని పేర్కొన్నారు. హుజూర్​నగర్​లో అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ముందు నుంచే నిర్లక్ష్యం చేస్తూ... పథకం ప్రకారమే ఎండీని నియమించలేదని ధ్వజమెత్తాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా... ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో ఉన్న ఆర్టీసీని తెరాస ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టిందని ఉత్తమ్​ మండిపడ్డారు.

'బాధలో ఉన్న వారిపై మంత్రుల విమర్శలా...?'

ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్​నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం

Intro:హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల ఓట్లు పడాలి....ఉత్తమ్

సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నల్లగొండ లోక్సభ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను వారి కుటుంబాలను రోడ్డుపై పడవేసిన దుర్మార్గుడు ఈ కేసీఆర్ అని పేర్కొన్నారు... టిఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్న, ఆ పార్టీని ఓడించాలన్న ఆ సత్తా ఉన్న వారికి కార్మికులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చాడు.. హుజూర్నగర్ లో అధికార పార్టీ నేతలు డబ్బు మద్యం ప్రవాహం ఏరులై పరిస్తున్నారనీ పేర్కొన్నారు. తెలంగాణలోని ఆర్టీసీ నిర్లక్ష్యం చేస్తూ పథకం ప్రకారమే ఆర్టీసీ సంస్థ ఎండి ని నియమించలేదని ధ్వజమెత్తాడు.. హైకోర్టు మొట్టికాయలు వేసిన తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని ఎద్దేవ చేశారు...కాంగ్రెస్ హయాంలో లాభాల్లో ఉన్న ఆర్టీసీని టిఆర్ఎస్ ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టింది....

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.