సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన గుండ్ల మల్లయ్య కల్లు గీసేందుకు తాటిచెట్టు పైకి ఎక్కాడు. కల్లు గీసి కిందకు దిగుతుండగా.. పొరపాటున జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తలకు బలమైన గాయం కావడం వల్ల స్పృహ కోల్పోయిన మల్లయ్యను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్