సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. మూడో కేసు నమోదైన తర్వాత.. అతనికి సన్నితంగా ఉన్న 28 మందిని ప్రైమరీ కాంటాక్ట్‌లుగా గుర్తించి సూర్యాపేట క్వారంటైన్ హోంకు తరలించారు.
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా తిరుమలగిరిలో ముగ్గురుకి కరోనా సోకడం వల్ల ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఎవరిని అనుమతించడం లేదు. నిత్యవసర సరకులను అధికారులే సరఫరా చేస్తున్నారు.
ఇవీచూడండి: ఒకే కుటుంబంలో 31 కేసులు