సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో ఓ యువకుడిని ఐసోలేషన్‌కు తరలిస్తుండగా అంబులెన్స్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు ఓ వర్గం వారు. పాజిటివ్ కానప్పటికీ తీసుకెళ్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడం వల్ల సూర్యాపేట ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆ యువకుడు ఖమ్మం క్వారంటైన్ నుంచి నిన్న గ్రామానికి వచ్చాడు. ఇటీవల దిల్లీకి వెళ్లి వచ్చిన వారితో ఖమ్మంలో కలిసి తిరిగినట్లు అనుమానంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం