సూర్యాపేట జిల్లా కోదాడలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా తెలంగాణ విద్యార్థి వేదిక కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ... కార్పొరెట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని మండిపడ్డారు. రేషనలైజేషన్ పేరుతో 3 వేల పాఠశాలను మూసేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి నిర్ణయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో