Jagadish Reddy Tested Corona Positive : రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొవిడ్ సోకగా.. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
Corona Positive for Jagadish Reddy : జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలతో పరీక్ష చేయించుకోగా.. కరోనా నిర్ధరణ అయినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
Corona Cases in Telangana : ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మహమ్మారి సోకుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. భౌతిక దూరం పాటిస్తూ.. తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకోవాలని అన్నారు.