హుజూర్నగర్లో నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చావా కిరణ్మయి ప్రచారం నిర్వహించారు. గండేపల్లి మండలం రాయనగూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. హుజూర్నగర్ నియోజకవర్గ ఆడబిడ్డగా, స్థానిక మహిళగా తనను శాసనసభకు పంపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చావా కిరణ్మయి గెలుపుకోసం గడపగడప తిరిగారు.
- ఇదీ చూడండి : ఆగని ఆర్టీసీ కార్మికుల బలిదానాలు