సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెం తహసీల్దార్లను కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని... కొత్త పట్టా పుస్తకాలు ఇవ్వడంలోనిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో పర్యటించారు. ఇద్దరు తహసీల్దార్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం వల్ల పాలనాధికారి వీరిపై వేటు వేశారు.
ఇవీచూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!